Breaking News

‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్‌

Published on Mon, 06/15/2026 - 09:21

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్‌ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్‌.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.

దీనిపై ఎక్స్‌లో స్పందించిన లారెన్స్‌.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్‌ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్‌ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)