Breaking News

డిసెంబరులో వచ్చే సినిమాలేంటి? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?

Published on Mon, 12/01/2025 - 15:51

2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. కొత్త ఏడాదికి మరో నెల మాత్రమే ఉంది. ఈ ఏడాది టాలీవుడ్‍‌కి ఉన్నంతలో బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, డాకు మహారాజ్, మిరాయ్, హిట్ 3, కుబేర, ఓజీ చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధించాయి. మరి డిసెంబరులో రాబోతున్న సినిమాలేంటి? వీటిలో ఎవరు హిట్ అయ్యే అవకాశముంది?

(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)

తొలివారంలో బాలకృష్ణ-బోయపాటి 'అఖండ 2' రాబోతుంది. దీనికి పోటీగా వేరే ఏ సినిమాలు లేవు. గతంలో దీని తొలి భాగం.. 2021 డిసెంబరులో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌తోనే సీక్వెల్‌ని కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తున్నారు. తొలి పార్ట్‌లో ఎక్కువగా యాక్షన్‌ని నమ్ముకోగా, ఈసారి యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలు కూడా బాగానే ఉండబోతున్నాయని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దీని ఫలితం ఏమొస్తుందో చూడాలి? దీనితో పాటు హిందీ చిత్రం 'ధురంధర్'.. 5వ తేదీనే రిలీజ్ కానుంది. కాకపోతే తెలుగు వరకు అయితే ఏ సమస్య ఉండదు.

రెండో వారంలో యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'మోగ్లీ' రిలీజ్ కానుంది. రోషన్ తొలి మూవీ 'బబుల్ గమ్' ఫ్లాప్ అయినప్పటికీ.. ఈసారి దర్శకుడు సందీప్ రాజ్ కావడం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. గతంలో ఈ డైరెక్టర్.. 'కలర్ ఫోటో' మూవీ తీశాడు. కాకపోతే అది ఓటీటీ రిలీజ్. ఈసారి మాత్రం థియేటర్ రిలీజ్. ఏం చేస్తారో చూడాలి? దీంతో పాటు నందు 'సైక్ సిద్ధార్థ్', ఘంటసాల, సకుటుంబానాం అనే తెలుగు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. ఇదే తేదీన కార్తీ డబ్బింగ్ సినిమా 'అన్నగారు వస్తారు' రిలీజయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి డేట్ అధికారికంగా ప్రకటించలేదు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

మూడో వారం తెలుగు నుంచి 'దేవగుడి' అనే చిన్న సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. అయితే ఆ వీకెండ్‌లో 'అవతార్' ఫ్రాంఛైజీలో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్' రిలీజ్ కానుంది. దీనికి ప్రపంచవ్యాప‍్తంగా క్రేజ్ ఉంది. అవతార్ తొలి పార్ట్ వేల కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో పార్ట్ మాత్రం ఓకే ఓకే అనిపించుకుంది. మరి మూడో పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదే వారంలో 'డ్యూడ్' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ రిలీజ్ కానుంది. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో దీన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో ఇది విడుదల కానుంది.

నాలుగో వారం బోలెడన్ని తెలుగు సినిమా లైన్‌లో ఉన్నాయి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'ఛాంపియన్', దండోరా, పతంగ్, శంబాల అనే చోటామోటా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలోనూ దేనిపై అస్సలు బజ్ లేదు. రిలీజ్ టైంకి వస్తుందోమో చూడాలి. వీటితో పాటు చివరి వారంలో అనకొండ  (తెలుగు డబ్బింగ్), ఇక్కీస్ (హిందీ సినిమా), వృషభ (మలయాళ డబ్బింగ్) అనే మూవీస్ కూడా రాబోతున్నాయి. వీటిలో అఖండ 2, అవతార్ 3కి మాత్రమే ప్రస్తుతం ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తాయి. మిగిలిన వాటిలో కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేసి ఏమైనా హిట్ కొడితే క్లైమాక్స్ సుఖాంతం అయ్యే అవకాశముంది.

(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)