Breaking News

లత్కోర్‌ హరీశ్‌.. దారుణంగా అవమానించిన నాగ్‌! జుట్టు కత్తిరించుకున్న రీతూ

Published on Sun, 09/28/2025 - 09:18

నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్‌ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్‌ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్‌ఫైర్‌తో శనివారం ఎపిసోడ్‌ ఎంటర్‌టైనింగ్‌గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్‌ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్‌ ఆడాడని రాముపై మండిపడింది. 

త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..
అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్‌ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్‌ మ్యాన్‌ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్‌.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్‌ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్‌ తిరిగిచ్చేశాడు. 

జుట్టు కత్తిరించుకున్న రీతూ
తనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్‌ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్‌ హెయిర్‌కట్‌ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్‌ కట్‌ చేసింది. జుట్టు కట్‌ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్‌ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్‌. 

ఒ‍ప్పుకోని సుమన్‌, శ్రీజ
అందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్‌.. సిగరెట్స్‌ త్యాగం చేయాలన్నాడు.. సుమన్‌ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్‌ బాక్స్‌ను స్టోర్‌ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్‌రూమ్‌లో ఉన్న బాక్స్‌ తీసుకుని స్టోర్‌ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్‌.. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అని కామెంట్‌ చేశాడు.

లత్కోర్‌ పంచాయితీ
ఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్‌.. పవన్‌-రీతూలు చాక్లెట్‌ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్‌ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్‌.. లత్కోర్‌ హరీశ్‌ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్‌ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్‌ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్‌ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్‌ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్‌ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్‌ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్‌ ముగిసింది.

చదవండి: ద ట్రయల్‌ 2 సిరీస్‌ రివ్యూ: ఈ సిరీస్‌ పెద్దల కోసమే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)