Breaking News

ఆ నలుగురు ఫేక్‌.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి

Published on Mon, 09/15/2025 - 09:02

మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్‌ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్‌ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్‌ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్‌ హీరోహీరోయిన్‌ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్‌ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు. 

రెచ్చిపోయిన భరణి
హౌస్‌లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్‌ చేయించాడు నాగ్‌ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్‌ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్‌ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్‌. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్‌ చేశారు. రెజ్లింగ్‌ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్‌.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్‌ ఆడాడు.

పర్మినెంట్‌ ఓనర్‌గా భరణి
ఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్‌, శ్రష్టి ఉన్న రెడ్‌ టీమ్‌ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్‌ అవ్వాలనేది ఓడిన టీమ్‌ డిసైడ్‌ చేయాలన్నారు. సంచాలక్‌ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్‌, సంజన, రీతూ చౌదరి, సుమన్‌ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్‌ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. 

మాట మార్చిన ఇమ్మాన్యుయేల్‌
అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్‌ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్‌ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్‌ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్‌ పవన్‌ సేవ్‌ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్‌ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్‌ ఇచ్చారు. 

నమ్మకం మీద దెబ్బ కొట్టారు
అందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్‌ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్‌, మర్యాద మనీష్‌, మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌, ఫ్లోరా సైనీ జెన్యూన్‌ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్‌ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్‌ టాస్క్‌.. ఇకపై సుమన్‌ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్‌ వేసింది.

చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్‌.. ఎంత సంపాదించింది..?

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)