Breaking News

ఇంగ్లిష్‌ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్‌? నోరు పారేసుకున్న సంజనా

Published on Wed, 10/01/2025 - 10:28

గతంలో గౌతమ్‌ సీక్రెట్‌ రూమ్‌కు వెళ్లొచ్చి నెగెటివ్‌ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఓవర్‌ డైలాగ్స్‌, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్‌వీక్‌ ఎలిమినేట్‌ అయి వీకెండ్‌లో మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్‌ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్‌ 30) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

వెరైటీ నామినేషన్స్‌
ఈవారం నామినేషన్స్‌ కాస్త వెరైటీగా ప్లాన్‌ చేశాడు బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9). హౌస్‌మేట్స్‌తో లూడో గేమ్‌ ఆడించాడు. కాకపోతే డైస్‌ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్‌ పవన్‌ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్‌కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్‌లో సుమన్‌ శెట్టి టీమ్‌(సుమన్‌, ఫ్లోరా, రాము రాథోడ్‌) గెలిచింది. కెప్టెన్సీలో పవన్‌కు ఫేవర్‌ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్‌ చేశాడు సుమన్‌. సుమన్‌ టీమ్‌కే మరొకర్ని నామినేట్‌ చేసే ఛాన్స్‌ రాగా.. రాము సంజనాను నామినేట్‌ చేశాడు.

ఇంగ్లిష్‌ వచ్చా?
మీ వల్ల హౌస్‌ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్‌.. హౌస్‌లో మోస్ట్‌ ఆఫ్‌ ది వయొలెన్స్‌ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్‌ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్‌ తెలుసా? వయొలెన్స్‌ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.

హరీశ్‌ బెదిరింపులు
ఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తప​ఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్‌ను నామినేట్‌ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్‌ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్‌ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్‌ చెప్పారు. 

నామినేషన్స్‌లో ఆరుగురు
కానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్‌ ఫేస్‌ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్‌పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్‌ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్‌ నామినేట్‌ అయ్యారు. ఏదేమైనా మనీష్‌, ప్రియల ఎలిమినేషన్‌తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్లు పడవు అని అర్థమై సైలెంట్‌ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. 

చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)