Breaking News

Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?

Published on Mon, 09/29/2025 - 08:56

బిగ్‌బాస్ 9వ సీజన్‍‌లో మూడో ఎలిమినేషన్ జరిగింది. డాక్టర్ పాప ప్రియ బయటకొచ్చేసింది. మొత్తంగా ఆరుగురు సామాన్యుల్లో ఒకరిగా అడుగుపెట్టిన ఈమె.. ఎక్కువ వారాలు ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ అనుహ్యంగా త్వరగానే ఔట్ అయిపోయి హౌస్‌ని వీడింది. మరి ప్రియ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?

కర్నూలుకి చెందిన ప్రియ.. నటి కావాలని ఆశపడింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అయింది. రీసెంట్‌గా ఈమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దాని నుంచి తప్పించుకునేందుకు బిగ్‪‌బాస్‌లోకి రావాలనుకుంది. అలా అ‍గ్నిపరీక్ష పోటీలో నెగ్గి ఐదో కామనర్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది అని మాటే గానీ ప్రతిదానికి మొదటి నుంచి ఓవరాక్షన్ చేయడం ఈమెకు చాలా మైనస్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?)

అలానే ఇచ్చిన సంచాలక్ పనిని కూడా సక్రమంగా చేయలేదు. అక్కడొకటి జరిగితే ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసేసుకోవడం లాంటి వాటి వల్ల ఈమెపై చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఫ్లోరా.. ఇమ్యూనిటీ సాధించి సేవ్ అయిపోయింది. మిగిలిన వారిలో హరీశ్, రాము, రీతూ, కల్యాణ్, ప్రియ ఉండగా.. వీళ్లలో అతి తక్కువ ఓట్లు ప్రియకే పడ్డాయి. అంటే ప్రేక్షకుల్లో ఈమె పట్ల ఎక్కువగానే నెగిటివిటీ ఏర్పడింది. దీంతో మూడో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది.

మూడు వారాల పాటు హౌసులో ప్రియ ఉంది. అయితే వారానికి రూ.70 వేల చొప్పున ఈమెకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. అలా మూడు వారాలకుగానూ రూ.2.10 లక్షల పారితోషికం ఈమె అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను మరికొన్ని వారాల పాటు ఉంటానని అనుకున్నానని, కానీ ఇలా జరిగిపోవడం కాస్తంత బాధగానే ఉందని హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ నాగార్జునతో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)