Breaking News

వరస్ట్‌ కంటెస్టెంట్‌ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్‌.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ

Published on Sat, 10/11/2025 - 09:57

తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్‌ కల్యాణ్‌. అతడిని సేఫ్‌ జోన్‌లో పడేయడంతో పాటు కెప్టెన్‌ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్‌ 10వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

పూల్‌ టాస్క్‌
కల్యాణ్‌ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్‌ జోన్‌లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్‌, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్‌ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్‌ జోన్‌లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్‌ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్‌ చివరి ఛాన్స్‌గా పూల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్‌ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.

కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజ
సేఫ్‌ జోన్‌లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్‌, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్‌, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్‌ కావాలన్నది డిసైడ్‌ చేయమని డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్‌ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్‌ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్‌, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్‌ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.

కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
కెప్టెన్సీ బ్యాండ్‌ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్‌ ప్లేయర్‌ అన్న దివ్యతో బ్యాండ్‌ కట్టించుకుని కాలర్‌ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్‌ అవ్వాల్సిన తను.. డేంజర్‌ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్‌ జోన్‌ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్‌ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్‌ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.

చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్‌ అవార్డ్‌: స్టార్‌ డైరెక్టర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)