Breaking News

బాడీ షేమింగ్‌, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్‌

Published on Sun, 10/26/2025 - 09:44


తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్‌ క్యాండిడేట్‌ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్‌ ఉంది. కల్యాణ్‌ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్‌ అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం మైనస్‌గా మారనుంది.

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్‌గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్‌ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్‌ 25వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

రాజాతో రీప్లేస్‌ చేశావా?
ఇమ్మాన్యుయేల్‌.. కల్యాణ్‌తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్‌ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్‌ను నాగ్‌ ప్రస్తావిస్తూ అది సేఫ్‌ గేమ్‌, డైరెక్ట్‌గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్‌ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్‌ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్‌ బాండ్‌ కాదు సర్‌. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్‌ అయ్యారు. 

తోసేసినా వెళ్లనంటోంది
వచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్‌ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్‌ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్‌గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్‌. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్‌ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. 

మాధురికి క్లాస్‌
ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్‌ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్‌ రోలర్‌, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్‌ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్‌ పడింది. గేమ్‌లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్‌కు ఇవ్వడం.. కంటెండర్‌షిప్‌ కోసం తనను సైడ్‌ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. 

బయట తోపు.. ఇక్కడ కాదు!
బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్‌ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్‌ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్‌బాస్‌ హౌస్‌లో కాదు అని కాస్త సాఫ్ట్‌గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో ఫేక్‌ బాండ్స్‌, ఇన్‌సెక్యూర్‌.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్‌ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్‌ నామినేషన్‌ అని తెలుస్తోంది. ఇ​‍క ఈ ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను మాత్రమే సేవ్‌ చేశారు. సేవ్‌ అయితే ఏదో చెప్తానన్నావ్‌.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్‌ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.

చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)