Breaking News

వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్‌లో శ్రీజ, భరణి రీఎంట్రీ!

Published on Wed, 10/29/2025 - 10:23

ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఒకర్ని నామినేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు నామినేషన్‌ చేసే పవర్‌ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్‌ 29వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

భరణి రాకతో ఆనందభాష్పాలు
భరణి (Bharani Shankar) హౌస్‌లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్‌ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్‌ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్‌ చేశా.. అని దివ్య డిమాండ్‌ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్‌కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.

దివ్యను పట్టించుకోని భరణి
నిఖిల్‌.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను గేమ్‌ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్‌ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్‌ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్‌, బాండ్స్‌ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్‌ అయింది.

నామినేషన్స్‌లో ఎనిమిది మంది
శ్రష్టి.. డిమాన్‌ పవన్‌ (Demon Pavan)ను నామినేట్‌ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్‌, డిమాన్‌ పవన్‌, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్‌, రాము నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారన్నాడు బిగ్‌బాస్‌.

రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్‌
ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్‌ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది.  మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్‌మేట్స్‌ గేమ్‌ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్‌ ద్వారా డిసైడ్‌ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!

చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)