Breaking News

కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Published on Mon, 10/27/2025 - 11:48

గత సీజన్‌లో జరిగిన నామినేషన్స్‌ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో (Bigg Boss Telugu 9) రిపీట్‌ కాబోతున్నాయి. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి నామినేట్‌ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్‌గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్‌ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్‌ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్‌ చేయాలన్నమాట!

సంజనాకు క్లాస్‌ పీకిన ప్రియ
ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్‌, శ్రీజ, ‍ప్రియ, ఫ్లోరా.. హౌస్‌లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్‌ చేసిన సంజనాను ప్రియ నామినేట్‌ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్‌ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్‌ పీకింది. మనీష్‌.. కల్యాణ్‌కు కత్తి గుచ్చాడు. సర్‌ప్రైజ్‌ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్‌నే నామినేట్‌ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్‌.. తనూజను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది.

నామినేషన్స్‌లో ఎనిమిదిమంది
సోషల్‌ మీడియాలో వైరలవుతున్న లీక్స్‌ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్‌, రీతూ, రాము, సంజనా, డిమాన్‌ పవన్‌, కల్యాణ్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది. ఎలిమినేట్‌ అయినవారిలో కొద్దిమంది బిగ్‌బాస్‌ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్‌లో అడుగుపెడతారా? చూడాలి!

 

చదవండి: అక్కడ ఫోకస్‌ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్‌.. సంపాదన ఎంతంటే?

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)