Breaking News

లోకేశ్‌.. మీ సంగతేంటి!?

Published on Mon, 07/27/2026 - 05:06

సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్‌ బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

లోకేశ్‌ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్‌లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్‌ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్‌ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)