భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
ఒక్క క్లిక్తో నాలుగు సినిమాల రివ్యూస్.. ‘దసరా’ విజేత ఏది?
Published on Sun, 10/18/2026 - 12:39
ఈ దసరాకి టాలీవుడ్లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి డబ్బింగ్ సినిమా అయితే..మిగతా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. విడుదలకు ముందు ప్రతి చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడడంతో బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.మరి ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలేవి? దసరా విజేతగా నిలిచిందెవరు? ఓ లుక్కేద్దాం.
ఈ దసరా బరిలో ముందు వచ్చిన సినిమా జైలర్ 2. అక్టోబర్ 15 ఈ రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ దిలీప్ కుమార్ మరోసారి తనదైన స్క్రీన్ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ సాగదీతగా అనిపించింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక అక్టోబర్ 16న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఆ స్థాయిలో కాదు కానీ ఈ సినిమాకు కూడా డీసెంట్ టాక్ వచ్చింది. కథలో విషయం ఉంది కానీ.. స్లోనెరేషన్, నిడివి ఇబ్బందికరంగా మారింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక అక్టోబర్ 16న రిలీజ్ అయిన మరో చిత్రం క్రేజీ కళ్యాణం. సందేశం బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచడంలో మాత్రం దర్శకుడు తడపడ్డాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక ఈ దసరాకి చివరిగా రిలీజ్ అయిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రం..అక్కడక్కడా బోర్ కొట్టించినా.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, జానపద కళకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసేలా సాగుతుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్గా ఉంటుంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Tags : 1