ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
Published on Wed, 04/01/2026 - 16:35
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)
దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.
(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్‌లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’)
Tags : 1