Breaking News

2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?

Published on Wed, 02/04/2026 - 08:14

ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్‌లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్‍‌ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్‌తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.

(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)

ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్‌తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?

  1. తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండ

  2. సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్

  3. మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్

  4. లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష‍్మి, అర్జున్ దాస్

  5. ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మ

  6. హమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీ

  7. హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్

  8. కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తి

  9. తలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రా

  10. ఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా

  11. మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్

  12. ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటో

  13. లస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మ

  14. టోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రా

  15. మా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి

  16. చుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తా

  17. ద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మ

  18. మామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్

  19. గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్

  20. గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్

  21. గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్‌పాయ్, శ్రద్ధాదాస్

  22. లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీ

  23. కర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్

  24. ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్

  25. లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్

  26. దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్

  27. హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మ

  28. దేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్

  29. అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)