ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్‌లో నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!

Published on Mon, 02/02/2026 - 16:32

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్‌ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.

కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్‌ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది.

 

 

 

 

 

 

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)