Top Stories
ప్రధాన వార్తలు
ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్‌లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరుగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడుకి కేబినెట్లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్‌కు సహాయ మంత్రులుగా బెర్త్‌లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తొలుత ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు.
సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్ వేపింగ్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్? సిగరెట్స్ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్..?వేపింగ్ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్ ఎడిక్షన్కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..)
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్రతద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.ఇక దాయాది పాక్‌పై భారత్ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్!‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్ అనేది బ్యాటర్ల గేమ్.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపాడు.ఈ క్రమంలో సచిన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(3/14).చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు View this post on Instagram A post shared by ICC (@icc)
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు
అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
తప్పక చదవండి
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్‌పై ఫిర్యాదు
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
సినిమా
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ప్రముఖ యువ నటి నూర్ మాళబిక (32) అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబయిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఈమె ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ప్రాణాలు వదిలేసింది. అయితే నూర్ బాడీ కుళ్లిన స్థితిలో ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నూర్ కుటుంబ సభ్యులు కనీసం ఈమెని చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడిదే పలు అనుమానాలకు తావిస్తోంది.అసోంకి చెందిన నూర్ మాళవిక.. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు అడల్ట్ సిరీస్, సినిమాల్లో నటించింది. కానీ గతేడాది 'ద ట్రయల్' వెబ్ సిరీసులో నటించి మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)ఏమైందో ఏమో మరి ముంబయిలోని ఈమె ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. కానీ ఈమె బాడీ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఆత్మహత్య అని అనుమానపడుతున్నారు.నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందే కుటుంబ సభ్యులు.. ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి బాడీని తీసుకెళ్లమని చెబితే పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాతే నూర్ చనిపోవడం కాస్త డౌట్ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చిన్న చిత్రాలే రిలీజ్ కానున్నాయి. వీటిలో యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ఉన్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగువి కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'పారిజాతపర్వం' సినిమాలతో పాటు 'పరువు' అనే తెలుగు సిరీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీటితో పాటు 'మహారాజ' మూవీ, 'ద బాయ్స్' సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. మరి ఓవరాల్‌గా ఎన్ని మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 10- 16 వరకు)నెట్ఫ్లిక్స్టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 11కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14హాట్స్టార్ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12జియో సినిమాఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) - జూన్ 11అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాపారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14ఆపిల్ ప్లస్ టీవీప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14జీ5లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్‌పై ఫిర్యాదు
షో స్టాపర్.. ఈ సిరీస్ ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ మధ్య ఈ సిరీస్‌ను అటకెక్కించారని ప్రచారం జరిగితే అదంతా అబద్ధమని దర్శకనిర్మాత మనీశ్ హరిశంకర్ పేర్కొన్నాడు. డబ్బింగ్ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నాడు. జీనత్ అమన్, జరీనా వాహబ్, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్ రాజ్ జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రగల్భాలు పలికి..ఈ క్రమంలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై నిర్మాత మనీశ్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. షో స్టాపర్ ప్రాజెక్ట్ కోసం హీరో అక్షయ్ కుమార్‌తో పాటు అతడి నిర్మాణ కంపెనీని ఈ సిరీస్ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగన ప్రగల్భాలు పలికింది. తనకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌తో పరిచయాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేస్తానని నమ్మించింది. పెద్దమొత్తంలో డబ్బు గుంజిఅలా అక్షయ్ కుమార్‌ను రప్పిస్తానని చెప్పి తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరకు మోసం చేసిందని ఎమ్హెచ్ ఫిలింస్ బ్యానర్ ఆరోపిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరిశంకర్‌ను బెదిరించిందని అతడి అడ్వకేట్ ఫాల్గుని బ్రాహ్మభట్ తెలిపారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోయిందని, పేమెంట్స్ ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి తమ బ్యానర్ ప్రతిష్ట దిగజార్చారంటూ నటుడు రాకేశ్ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణన్ పార్మర్పైనా నిర్మాత పరువు నష్టం దావా వేశారు. కాగా దిగంగన తెలుగులో హిప్పి, వలయం, సిటీమార్, క్రేజీఫెలో వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.చదవండి: ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్‌డే పార్టీకి పిలిచి ఆపై..
ఫొటోలు
అనార్కలీ డ్రెస్‌లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్న సుమ (ఫోటోలు)
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
Priyanka Arul Mohan: సీతాకోకచిలుకలా మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
క్రీడలు
టీమిండియా విజయం.. క్రెడిట్ మొత్తం మా వాళ్లకే: అక్తర్
‘‘టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం పాకిస్తాన్‌కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.పాకిస్తాన్ మిడిలార్డర్‌ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్‌గా.. సర్ప్రైజ్గా ఉంది’’ అని పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.తొలుత అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!అయితే, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
బుమ్రా సూపర్ బాల్.... దెబ్బకు రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌పై భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో భారత బౌలర్లు అద్బుతంగా రాణించారు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. అయితే లక్ష్య చేధనలో పాకిస్తాన్ భారత్ కంటే మెరుగ్గానే ఆడింది. 14 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో భారత ఓటమి లాంఛనమే అని అంతా ఫిక్స్ అయిపోయాడు.బుమ్ బుమ్ బుమ్రా..అప్పుడు ఎటాక్‌లో వచ్చాడు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా. తన సెకెండ్ స్పెల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే బుమ్రా మార్చేశాడు. 15 ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతికే అద్బుతమైన డెలివరీతో డేంజరస్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రిజ్వాన్.. క్రాస్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి లో బౌన్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అస్సలు బంతి అంతలా లో బౌన్స్ అవుతుందని రిజ్వాన్ ఊహించలేకపోయాడు.దీంతో ఒక్కసారిగా రిజ్వాన్ సైతం ఆశ్చర్యపోయాడు. 31 పరుగులు చేసిన రిజ్వాన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజ్వాన్ వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. అనంతరం తిరిగి 19వ ఓవర్ వేసిన బుమ్రా.. కేవలం 3 పరుగులిచ్చి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ఆఖరి ఓవర్లో 18 పరుగుల కావాల్సిన నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. View this post on Instagram A post shared by ICC (@icc)
T20 World Cup 2024: పాక్‌పై విక్టరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. పాక్‌పై తమ గెలుపు రికార్డును (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) మరింత మెరుగుపర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్-పాక్‌లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 7 సార్లు విజయం సాధించి పొట్టి ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టు ఓ ప్రత్యర్ధిపై ఇన్ని విజయాలు (7) సాధించలేదు. పాక్‌పై గెలుపుకు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండిది. శ్రీలంక పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్‌పై 6 సార్లు విజయం సాధించింది. తాజాగా భారత్.. శ్రీలంక రికార్డును తిరగరాసి పాకిస్తాన్‌పై 7 మ్యాచ్‌ల్లో విజయబావుటా ఎగురవేసింది.ఇరు ఫార్మాట్ల ప్రపంచకప్ టోర్నీల్లో చూస్తే పాక్‌పై భారత్ విజయాల రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు ఫార్మాట్లలో (వన్డే, టీ20) భారత్-పాక్‌లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో తలపడగా.. పాక్ ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. 2021 టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాక్.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్ మినహా ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై పాక్ ఎప్పుడూ గెలవలేదు.వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అయితే పాక్‌పై భారత్ గెలుపు రికార్డు వంద శాతంగా ఉంది. ఈ ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ అన్ని మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వరుస విజయాల విభాగంలో ఇదే రికార్డు. ఓవరాల్‌గా చూస్తే ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్ డామినేషన్ ఓ రేంజ్లో కొనసాగుతుంది.కాగా, న్యూయార్క్ వేదికగా నిన్న (జూన్ 9) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్ 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.తొలుత పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్‌కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు మరింత చాకచక్యంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్రతద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.ఇక దాయాది పాక్‌పై భారత్ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్!‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్ అనేది బ్యాటర్ల గేమ్.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపాడు.ఈ క్రమంలో సచిన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(3/14).చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు View this post on Instagram A post shared by ICC (@icc)
బిజినెస్
ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవ్వడంపై కేంద్రం, సెబీ నివేదిక సమర్పించాలని విశాల్ తివారీ అనే న్యాయవాది డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పూర్తి నివేదికన సమర్పించేలా కేంద్రం, సెబీకి ఆదేశాలు జారీచేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు. దాంతోపాటు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ జనవరి 3న ఇచ్చిన సూచనలపై స్టేటస్ రిపోర్టును సమర్పించేలా ప్రభుత్వం, సెబీని ఆదేశించాలని కోరారు.నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం, సెబీ నిర్మాణాత్మకంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.తివారీ దాఖలు చేసిన పిటిషన్లో..‘సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటనల సమయంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పెరిగాయి. కానీ వాస్తవ ఫలితాలు వెలువడిన రోజు మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని నివేదికల ప్రకారం ఏకంగా ఒక్కరోజే రూ.20లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం నియంత్రణ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మార్కెట్ నియమాలపై స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించలేదు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం సోమవారం (జూన్3న) బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లేదా 3.4 శాతం పెరిగి 76,469 వద్ద గరిష్ట స్థాయిని చేరింది. తర్వాతరోజు వాస్తవ ఫలితాలు వెలువడిన మంగళవారం సెన్సెక్స్ 4,390 పాయింట్లు లేదా 6 శాతం దిగజారి 72,079 వద్ద స్థిరపడింది.
ఆల్‌టైమ్‌హైలో స్టాక్‌మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 23,402కు చేరింది. సెన్సెక్స్ 334 పాయింట్లు ఎగబాకి 77,015 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.36 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం, నాస్డాక్ 0.25 శాతం నష్టపోయాయి.ఫెడ్ సమావేశమే కీలకం..అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలిరేట్ల తగ్గింపు సెప్టెంబర్లోనా..? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో 4.8 శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమం సోమవారం (జూన్ 10) నుంచి జరగనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ ఐప్యాడ్‌లో వినియోగిస్తున్న రెటీనా డిస్ప్లేను శామ్సంగ్ కంపెనీ తయారు చేస్తోంది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83).
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు.
వీడియోలు
టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు
కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే
అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం
నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు
జనసేనకు 4 మంత్రి పదవులు..
ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు
రైతులకు గుడ్ న్యూస్..తొలి సంతకం చేసిన ప్రధాని మోదీ
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
ఫ్యామిలీ
రవి పరంజపే : చిత్రకారుల సంపద..!
అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్‌తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్‌లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్‌లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్‌కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం. రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్‌స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్‌స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్‌కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"? – అన్వర్.
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?
మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్) టైమ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్‌డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది.
మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో..కంగనా దేశీ లుక్ అదుర్స్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజకీయనాయకురాలిగా తన ప్రస్థానం మొదలుపెట్టనుంది. ముచ్చగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో కంగనా రనౌత్ సరికొత్త స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది. ఆమె నిజమైన బంగారం, వెండితో నేసిన చీరలో తళుక్కుమంది. అందుకు తగట్టు ధరించిన నగలతో అందర్నీ ఆకర్షిచింది. రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించేలా సరికొత్త దేశీ స్టయిల్ని అనుసరిస్తోంది. My oath day look, howz it ? 🙂 pic.twitter.com/VgKGJof69S— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 9, 2024ఈ వేడుక కోసం చేనేత చీర, అమ్రపాల జ్యువెలరీస్‌ని ఎంపిక చేసుకుంది కంగనా. లైట్ మేకప్‌తో వెరైటీ హెయర్ స్టయిల్‌తో సరికొత్త లుక్‌లో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.(చదవండి: ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!)
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు)
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
ధారూరు: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్‌కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Medical Student Dies: ఆరిపోయిన ఆశల దీపం
కర్నూలు(హాస్పిటల్)/ రొళ్ల: ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదం ఓ వైద్య విద్యార్థిని బలితీసుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్.తేజేశ్వర్‌రెడ్డి(22) ఆదివారం మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్ (రత్నగిరి జెడ్పీ హైసూ్కల్ టీచర్), గీతాలక్ష్మి (పిల్లిగుండ్ల గొల్లహట్టి ప్రాథమిక పాఠశాల టీచర్) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు తేజేశ్వర్‌రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చిన్న కుమారుడు వర్షిత్‌రెడ్డి బెంగళూరులో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాడు. తేజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదవడం ముగించుకుని.. వసతిగృహానికి బుల్లెట్ బండి (ద్విచక్రవాహనం)పై బయల్దేరాడు. కళాశాల గేటు దాటి బయటకు రాగానే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అదే రోడ్డులో నందికొట్కూరు నుంచి కర్నూలుకు వేగంగా వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. కిందపడిన తేజేశ్వర్‌రెడ్డిని దాదాపు 50 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు రావడంతో పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని అప్పగించారు. చదువు పూర్తయ్యాక పెద్ద డాక్టర్ అయి తమకు అండగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. 20 రోజుల కిందటే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పిల్లిగుండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు విద్యార్థి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వేల్పూరు ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ కార్యకర్తల దాడి
వినుకొండ (నూజెండ్ల): మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం మండలం వేల్పూరులోని ఎస్సీ కాలనీ వాసులపై ఆదివారం టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు దాడిచేసి నలుగురిని గాయపరిచారు. ఎన్నికల అనంతరం బూత్‌ల వారీగా ఓట్లు లెక్కేసుకున్న టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ కాలనీ వాసులతో గొడవకు దిగారు. అదేమని ప్రశ్నించిన బీర్నీడి దినేష్ కుమార్, తిరుపతి, రోశయ్య, నాగమ్మపై దాడిచేసి కొట్టి గాయపరిచారు. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. వినుకొండ రూరల్ సీఐ సుధాకర్, టౌన్ సీఐ సాంబశివరావు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.పెరికీడులో వైఎస్సార్సీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి» రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసం»ఘటనపై హనుమాన్‌జంక్షన్ » పోలీసులకు బాధితుల ఫిర్యాదుహనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడులో వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ పండు రాణి, మాజీ ఉప సర్పంచ్ పండు నాగార్జున దంపతుల నివాసంపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇంటిపైకి రాళ్లు విసురుతూ దుర్భాషలాడారు. మద్యంతాగి బైక్‌లపై వచ్చిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బైక్‌లపై చక్కర్లు కొడుతూ ఇంట్లో ఉన్న పండు రాణి, వారి కుమార్తెను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో గ్రామాంతరం వెళ్లిన పండు నాగార్జున ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఎస్ఐ–2 పి.ఆర్జమ్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ తెలిపారు. వణుకూరులో టీడీపీ, జనసేన దాడి, బెదిరింపు పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరులో వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ, జనసేన నేతలు దాడులు చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. వణుకూరులో తాపీమే్రస్తిగా పనిచేస్తూ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మైనార్టీ వ్యక్తి ఇంటిపై రెండురోజుల కిందట టీడీపీ నేతలు రాళ్లువేశారు. ఇంట్లో ఉన్న వారిని అంతుచూస్తామంటూ బెదిరించారు. ఇంటి బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వణుకూరు గ్రామంలో ఉంటున్న వైద్యుడి ఇంటికి జనసేన నేతలు వెళ్లి బెదిరించారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. టీడీపీ, జనసేన నేతల వైఖరి పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడిచిత్తూరు జిల్లా చిన్నరెడ్డిపల్లిలో ఎనిమిది మందికి గాయాలు యాదమరి (పూతలపట్టు): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలోని చిన్నరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు ఆదివారం దాడికి పాల్పడ్డారు. చిన్నరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన ఓ యువకుడు పనికి వెళుతుండగా అడ్డగించి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయి కర్రలతో వారిని కూడా చితకబాదారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాదమరి పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన యువకుడిని, అతని కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కొన్నిరోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మద్యం తాగి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు విసరడం, ఇళ్లలోని వస్తువులు, బైక్‌లను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కోరుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కౌలేపల్లిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుడు హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హిదయతుల్లా ప్రెసిడెంట్‌గా ఉన్న కౌలేపల్లి దేవరచెరువు సొసైటీలో 40 మంది సభ్యులున్నారు. వీరంతా చెరువులో చేపలు వదిలి జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు చంద్ర, అతడి అనుచరులు సాంబశివ, మధు, చిరంజీవి, నారాయణస్వామి తదితరులు చెరువులో వలలు తీసేయాలని హిదయతుల్లాను రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చెరువు వద్దనున్న హిదయతుల్లా వద్దకు వీరంతా వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చినందున చెరువు తమకే సొంతమని, ఇక్కడ మీరెవరూ చేపలు పట్టరాదని హెచ్చరించారు. పరుష పదజాలంతో దూషిస్తూ హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబ సభ్యులు కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
‘పోలీస్’ హ్యాకర్..20 ఏళ్ల విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్ఐ యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్ పోలీస్ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్ పోలీస్ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్ ఐ ,టీఎస్‌కాప్ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్ హాక్ఐ డేటాలోకి యాక్సెస్ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్ యాప్ అనేది పూర్తిగా పోలీస్ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంస్ సర్వర్ యూఆర్ఎల్ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్ఎల్ ఏప్రిల్ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్ అయినట్టు చెబుతున్న యూఆర్ఎల్ను హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ , ఎండ్ పాయింట్లలో ఏవైనా సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్ కేసును టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిషిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.