ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నిష్పక్షపాతంగా వ్యవహరించనందుకు నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంగళవారం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా పక్షం సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.