‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’ | KTR Open Letter To CM Revanth Reddy Over Chenetha Crisis, Details Inside - Sakshi
Sakshi News home page

‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’

Published Thu, Apr 4 2024 11:58 AM

KTR Open Letter To CM Revanth Reddy Over Chenetha Crisis - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: చేనేత కార్మికులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా ఓ ఘాటు లేఖ రాశారాయాన.  

‘‘నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష?. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా??. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని లేఖలో కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

చేనేత పరిశ్రమను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్‌. చేనేత మిత్రా వంటి పథకాల్ని కాంగ్రెస్‌ సర్కార్‌ పక్కనపెట్టిందని ప్రస్తావించారాయన. ‘‘గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.  ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు.. 

.. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం.  వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని లేఖలో కేటీఆర్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement