ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు | Jet Airways, IndiGo , go air Offer Low Fares, Tickets On Sale Below Rs. 1,000 | Sakshi
Sakshi News home page

ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Jan 5 2017 11:52 AM | Updated on Sep 5 2017 12:30 AM

ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ ఎయిర్ లైన్స్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్ ప్రైస్ వార్ లో మరింతగా దూసుకుపోతున్నాయి.

న్యూఢిల్లీ: విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ  ఎయిర్ లైన్స్  బాగానే క్యాష్  చేసుకుంటున్నాయి. ముఖ్యంగా  జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్  ప్రైస్ వార్ లో  మరింతగా  దూసుకుపోతున్నాయి. ఈ మేరకు తక్కువ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. 

జెట్ ఎయిర్ వేస్

'గెట్ సెట్ ఫర్ ప్లయింగ్ స్టార్ట్'  పేరుతో  తగ్గింపు ధరల పథకాన్ని  జెట్ ఎయిర్ వేస్  ప్రకటించింది. ఈ బుకింగ్స్ కోసం జనవరి 7, 2017  వరకు  అవకాశాన్ని కల్పించింది. ఎంపిక చేసిన విమానాల్లో రూ. 999 లకే టికెట్లను అందించనుంది.   దేశీయ రూట్లలో అన్ని టాక్స్ లను కలుపుకొని డిస్కౌంట్  రేట్లను అందిస్తోంది.
ఇండిగో
ఎంపిక చేసిన రూట్లలో  మరో  ఎయిర్ లైన్స్ ఇండిగో   కూడా రూ. 949 లకే విమాన టికెట్లను అందిస్తోంది. ఈ బుకింగ్ ద్వారా జనవరి 31, 2017 నుంచి  ఏప్రిల్ 13, 2017  మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది.   కోయంబత్తూరు -చెన్నైరూ. 949, న్యూఢిల్లీ- జైపూర్ రూ. 1,042,  చెన్నై-బెంగళూరు  రూ.1,187 ,  ఢిల్లీ-ముంబై  రూ. 2,214, రూ నుంచి ఢిల్లీకి చెన్నై- ఢిల్లీ రూ. 2,832 లకు అందుబాటులో ఉన్నట్టు   అధికారిక  వెబ్ సైట్లో ఇండిగో  పేర్కొంది.
గో ఎయిర్
ఎంపిక చేసిన మార్గాల్లో రూ.1,057  నుంచి ప్రారంభయ్యే టికెట్లను గోఎయిర్  ఆఫర్ చేస్తోంది. జనవరి 31 దాకా బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. ఈ పథకం క్రింద జైపూర్ - ఢిల్లీ రూ.1,267, బెంగళూరు - గోవా రూ.1,692  ఇతర ధరలను అందుబాటులోకి తెచ్చినట్టు  కంపెనీ వెల్లడించింది.

ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ (సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్) ప్రకారం  జనవరి -నవంబర్ 2016   భారత మార్కెట్లో విమాన ప్రయాణికుల సంఖ్య 23 శాతం జంప్ చేసి  903 లక్షలకు  పెరిగింది.  ఈ  నేపథ్యంలో దేశీయ విమానయానంలో బలమైన పెరుగదలను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలు ఈ తగ్గింపు ధరలను  ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వివరాలకోసం ఆయా సంస్థల వెబ్ సైట్లను సందర్శించవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement