కవయిత్రి రాజేశ్వరికి 10 వేల పెన్షన్ | Ten thousand pension for writer rajeswari | Sakshi
Sakshi News home page

కవయిత్రి రాజేశ్వరికి 10 వేల పెన్షన్

Feb 28 2015 4:17 AM | Updated on Aug 16 2018 1:18 PM

కవయిత్రి రాజేశ్వరికి 10 వేల పెన్షన్ - Sakshi

కవయిత్రి రాజేశ్వరికి 10 వేల పెన్షన్

కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి రాజేశ్వరికి ప్రతినెలా రూ.10 వేలు పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి రాజేశ్వరికి ప్రతినెలా రూ.10 వేలు పెన్షన్ అందేలా  ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఆమెను ఇటీవలే  సుద్దాల హనుమంతు పౌండేషన్ పురస్కారంతో సత్కరించింది. కాగా, ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాజేశ్వరిని   ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో వైకల్యాన్ని లెక్కచేయకుండా రచనలు చేస్తున్న రాజేశ్వరిని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీ సొమ్మును రాజేశ్వరికి పెన్షన్‌గా అందజేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, రాజేశ్వరికి పెన్షన్ ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహదారు కేవీ రమణాచారి, సినీ గేయ రచయిత  సుద్దాల అశోక్‌తేజ, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement