సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు | Telangana Sakuntala is no more | Sakshi
Sakshi News home page

సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు

Jun 14 2014 6:05 AM | Updated on Sep 2 2017 8:48 AM

సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు

సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు

సినీనటి తెలంగాణ శకుంతల (65) కన్నుమూశారు. హైదరాబాద్లోని కొంపల్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె గుండెపోటుతో మృతిచెందారు.

హైదరాబాద్: సినీనటి తెలంగాణ శకుంతల (65) కన్నుమూశారు. హైదరాబాద్లోని కొంపల్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె గుండెపోటుతో మృతిచెందారు.  70కి పైగా చిత్రాల్లో  శకుంతల నటించింది. ఆమె తొలి చిత్రం మాభూమి(1981)  సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలంగాణ శకుంతలగా సుపరిచతమైన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాక శకుంతల తెలంగాణ యాసను స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ఆధారభిమానులను సంపాదించుకుంది. ఆమె చివరిచిత్రం పాండవులు పాండవులు తుమ్మెద(2014). మహరాష్ట్రలో పుట్టిన శకుంతలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలంగాణ శకుంతల తీసిన పలుచిత్రాల్లో నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement