కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం

Published Mon, Mar 24 2014 3:17 AM

మాట్లాడుతున్న ఏపీ జితేందర్‌రెడ్డి

 అడ్డాకుల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలోని కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్వీఎం ద్వారా జిల్లాలో పని చేస్తున్న సీఆర్‌పీలు, ఐఈఆర్‌టీ, సీఆర్‌టీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీఎల్‌ఎంటీలు, మెసేంజర్‌లు, తాత్కాలిక శిక్షకుల సర్వసభ్య సమావేశం మండల పరిధిలోని మూసాపేట వద్ద వీహాన్  స్కూల్‌లో ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జితేందర్‌రెడ్డితో పాటు టీ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. సీమాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారని, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు.

పరిశ్రమలు ఎక్కువగా పాల మూరు జిల్లాకు రానున్నాయని, వాటితో ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ ప్రాం తం పూర్తి అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్‌ను రద్దు చేయాలని టీ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా టీటీసీ, బీఈడీ సీట్లు కేటాయిస్తారని, ఇక్కడ మాత్రం అన్ని ప్రవేశాలకు పరీక్షలను నిర్వహిం చడం సోచనీయమన్నారు. టెట్‌ను రద్దు చేస్తామనే ప్రకటన టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణారెడ్డి, మొగులయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement