పింగళి చైతన్యకు ‘యువ పురస్కార్’

పింగళి చైతన్యకు ‘యువ పురస్కార్’


ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ

సాక్షి, న్యూఢిల్లీ: యువ రచయిత్రి పింగళి చైతన్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2016 లభించింది. దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారం ప్రకటించారు. అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ నేతృత్వంలో గురువారం ఇంఫాల్‌లో జరిగిన సమావేశంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది. తెలుగు భాషకు సంబంధించి చైతన్య రాసిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ (సంక్షిప్త కథలు) పుస్తకానికి ఈ పురస్కారం దక్కిందని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.



తెలుగు భాషకు సంబంధించి డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ పాటిబండ్ల రజని, డాక్టర్ వాడరేవు చిన్నవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఈ అవార్డు కింద రూ.50 వేల నగదు పురస్కారం అందజేస్తారు.

 

వెంకటసుబ్బారావుకు ‘బాల్ సాహిత్య పురస్కార్’

 కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా 21 మంది రచయితలకు ‘బాల్ సాహిత్య పురస్కార్-2016’ అవార్డులను ప్రకటించింది. తెలుగు భాషకు సంబంధించి ఆలపర్తి వెంకటసుబ్బారావు (బాలబంధు) రాసిన స్వర్ణ పుష్పాలు (కవిత్వం) పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.50 వేల నగదు అందిస్తారు. నవంబరు 14న జరిగే బాలల దినోత్సవంలో అవార్డు అందజేస్తారని కె.శ్రీనివాసరావు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా తెలుగు భాషకు సంబంధించి బి.నరసింగరావు, ఎల్.ఆర్.స్వామి, ఎన్.కె.బాబు వ్యవహరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top