జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్ | Mahesh Babu agadu shoting in Jindal Steel plant | Sakshi
Sakshi News home page

జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్

Jun 30 2014 3:24 AM | Updated on Mar 28 2019 6:26 PM

జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్ - Sakshi

జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్

ప్రిన్స్ మహేష్‌బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ స్టీల్ ప్లాంటులో ఐదు రోజుల నుంచి జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల క్రితం జిందాల్ స్టీల్ ప్లాంటులో తీసిన సంగతి తెలిసిందే.

సాక్షి, బళ్లారి : ప్రిన్స్ మహేష్‌బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ స్టీల్ ప్లాంటులో ఐదు రోజుల నుంచి జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల క్రితం జిందాల్ స్టీల్ ప్లాంటులో తీసిన సంగతి తెలిసిందే. పాటలు, ఫైటింగ్‌లతోపాటు ఇతరత్రా వినోద సన్నివేశాల చిత్రీకరణ కోసం మహేష్‌బాబు వారం రోజుల నుంచి జిందాల్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఆదివారం ఉదయం కూడా మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం వైద్యులు పరీక్షించి జ్వరం వచ్చినట్లు తెలపడంతో షూటింగ్‌కు విరామం తీసుకున్నాడు. విపరీతమైన దుమ్మూ-ధూళితో కూడిన సన్నివేశం షూటింగ్‌లో పాల్గొనడంతో మహేష్‌బాబు కాస్త అనారోగ్యానికి గురైనట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మరో వారం రోజులు జిందాల్‌లోనే బస చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement