ఐపీఎల్‌లోని ఐదు మ్యాచులను నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఈ రోజునుంచే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లోని ఐదు మ్యాచులను నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఈ రోజునుంచే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3, 5, 7, 10, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నందున ఆయా దినాల్లో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు, నిబంధనలు, వాహన పార్కింగ్, పాదచారులు ఎటువైపునుంచి రావాలి, మ్యాచులకు హాజరయ్యేవారి భద్రత... ఇలా అన్ని విషయాల్లో ఢిల్లీ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారని ఢిల్లీ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు. గుర్తించిన వాహనాలకోసం మాత్ర మే స్టేడియం దగ్గర పార్కింగ్‌కు అవకాశం ఉందని, ఇతర వాహనదారులు సమీపంలోనే ఉన్న మాతా సుందరి పార్కింగ్, శాంతివ్యాన్ పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలు