కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ | Sakshi
Sakshi News home page

కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ

Published Wed, Apr 5 2017 9:35 AM

కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ

న్యూఢిల్లీ: చాలాకాలం తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన కుమారుడు చేసిన నిర్వాకం కారణంగా భిన్న ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అయితే, ఆ వ్యవహారం లాలూకు తెలిసే జరిగిందని మీడియా చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు పట్నా శివారు ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒక ప్లాట్‌ ఉంది. ఆ ప్లాట్‌లో ప్రస్తుతం ఓ పెద్ద వాణిజ్య భవన సముదాయం నిర్మిస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ దీనిని నిర్మిస్తోంది.

ఈ క్రమంలో భవన నిర్మాణం కోసం భారీ తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో బయటకు తీసిన మట్టి మొత్తాన్ని కనీసం ఎలాంటి టెండర్‌ కూడా పిలవకుండా దాదాపు రూ.90లక్షలకు పాట్నా జూపార్క్‌కు విక్రయించారు. ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ ఆధ్వర్యంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతడు అటవీ శాఖను నిర్వహిస్తున్నాడు.

సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు టెండర్స్‌ పిలుస్తుంటారు. కానీ, అలాంటిది లేకుండానే కేవలం లాలూకు సంబంధించి భూమిలో నుంచి మట్టిని నేరుగా జూపార్క్‌కు కేటాయించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ధుమారం రేగుతోంది. దీనిపై సమాధానం చెప్పాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Advertisement
Advertisement