హీరోయిన్‌ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం | key evidence in Malayalam actress molestation case | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం

Mar 9 2017 5:31 PM | Updated on Sep 5 2017 5:38 AM

మలయాళ హీరోయిన్‌ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు.

కోచి : మలయాళ హీరోయిన్‌ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న హీరోయిన్‌ను కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు వేధించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పల్సర్‌ సుని అనే వ్యక్తిని, హీరోయిన్‌ వాహనం డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి తమకు లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు.

కారులో ఆమెను వేధిస్తుండగా మొబైల్‌లో తీసిన వీడియో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడటానికి బ్లాక్‌మెయిల్‌ చేయాలనే యోచనే ప్రధాన కారణమని తేలిందని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం, భారీ కుట్ర కోణం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని.. తమకెటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కాగా, మార్టిన్‌, పల్సర్‌ సుని తదితరుల పోలీసు కస్టడీ గడువు రేపటితో ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement