అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల | 'Aagadu' to release in record number of screens in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల

Published Thu, Sep 18 2014 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల

అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల

సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది.

సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 159 స్క్రీన్లలో దీన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర చెప్పారు. అమెరికాలో ఇంత విస్తృత స్థాయిలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదని, తమ పంపిణీ భాగస్వామి ఇరోస్ ఇంటర్నేషనల్కు ఇందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశంలో కూడా తాము వందకుపైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు.

ఉత్తర భారతదేశంలో ఒక తెలుగుసినిమాకు ఇన్ని స్క్రీన్లు సాధించడం అంత సులభం కాదని, ఇరోస్ కారణంగానే ఇది కూడా సాధ్యమయ్యిందని ఆయన చెప్పారు. మహేశ్ బాబుతో శ్రీనువైట్ల తీసిన రెండో చిత్రం అయిన 'ఆగడు'లో మిల్కీబ్యూటీ తమన్నా ఆయన సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, సోనూ సూద్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అనిల్ సుంకర ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement