
ఆసియా ప్రముఖుల పుస్తకంలో ‘అయినాల’కు చోటు
రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ ప్రచురించిన ‘ఎమరాల్డ్ హూ ఈజ్ హూ ఇన్ ఆసియా’ పుస్తకంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ‘సహజకవి’ అయినాల మల్లేశ్వరరావుకు చోటు దక్కింది.
గుంటూరు(తెనాలి): రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ ప్రచురించిన ‘ఎమరాల్డ్ హూ ఈజ్ హూ ఇన్ ఆసియా’ పుస్తకంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ‘సహజకవి’ అయినాల మల్లేశ్వరరావుకు చోటు దక్కింది. ఆసియా ఖండంలోని 464 మంది ప్రముఖులతో ముద్రించిన ఈ పుస్తకంలో అయినాల గురించి ప్రచురించారు.
ఉపాధ్యాయ వృత్తిలో జాతీయ అవార్డు అందుకున్న అయినాల రచయితగానూ వాసికెక్కారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో పనిచేస్తున్నారు. తాజా గౌరవానికిగాను ఆయనకు పట్టణంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సాహితీమిత్రులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలియజేశారు.