వచ్చే జనవరి నుంచి ఆర్‌బీఐ రేట్ల పెంపు | Sakshi
Sakshi News home page

వచ్చే జనవరి నుంచి ఆర్‌బీఐ రేట్ల పెంపు

Published Mon, Apr 9 2018 2:44 AM

RBI rates hike since January next year - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2019 జనవరి–మార్చి) నుంచి ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచడం మొదలు కావచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ఆర్థిక రికవరీ అప్పటి నుంచి నిలకడగా ఉండడంతోపాటు ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్య స్థాయి నుంచి మరీ పెరిగే అవకాశాల్లేకపోవడం రేట్ల పెంపునకు సానుకూలతలుగా పేర్కొంది. ఈఏడాది చివరికి ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో మరింత స్పష్టత, స్థిరమైన ఆర్థిక రికవరీ దన్నుగా ఆర్‌బీఐ స్వల్ప మొత్తంలో రేట్ల పెంపు చేపట్టొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ తొలి పాలసీ సమీక్ష గత వారం ముగియగా, కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు డాయిష్‌ బ్యాంకు కూడా ఇదే  అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘‘75 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది కాకుండా రేట్ల పుంపు వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కావచ్చు’’ అని పేర్కొంది.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement