భద్రత వెరీ స్ట్రాంగ్‌ | Sakshi
Sakshi News home page

భద్రత వెరీ స్ట్రాంగ్‌

Published Wed, May 22 2024 12:45 AM

భద్రత

నిత్యం స్ట్రాంగ్‌

రూముల పరిశీలన

జిల్లాలోని కాకినాడ లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని కాకినాడ జేఎన్‌టీయూలో భద్రపరచిన విషయం తెలిసిందే. ఈ స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌ నిత్యం ఆయా రిటర్నింగ్‌ అధికారులతో కలసి సందర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకారం అందించాలని వారు కోరుతున్నారు. స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, వారి వాహనాలను సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

కాకినాడ సిటీ: పోలింగ్‌ ముగిసి పది రోజులైంది. కౌంటింగ్‌కు మరో 13 రోజుల సమయం ఉంది. ఆ క్షణాలు దగ్గరవుతున్నకొద్దీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ క్రమంలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. వచ్చే నెల 1న ఎగ్జిట్‌ పోల్స్‌, 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు గానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్‌ ప్రోగ్రాంలకు ఎటువంటి అనుమతులూ లేవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకులు సందేశాలు ఇవ్వడం, నిరాధార ఆరోపణలు చేయడం, రచ్చబండ చర్చలు, సోషల్‌ మీడియాల్లో ప్రచారం వంటి వాటిని నేరంగా పరిగణిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పోలింగ్‌ అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా పెట్రోలు బంకుల్లో లూజుగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించారు. బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. ధాబాలు, హోటళ్లు, పాన్‌షాప్‌లలో అక్రమ మద్యం, సారా అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. జూదం, కోడిపందాలు, కాయిన్‌ గేమ్‌, బెట్టింగ్‌ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సారా, మద్యం అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లాడ్జీలు, సత్రాలు, కల్యాణ మండపాల వంటి చోట్ల అపరిచిత, అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వు, సివిల్‌ పోలీసులతో భద్రత కల్పించారు. దీంతో పాటు సీసీ కెమెరాలతో 24 గంటలూ నిఘా పెట్టి, పర్యవేక్షిస్తున్నారు.

గ్రామాల్లో సమావేశాలు

ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓ స్థాయి పోలీసు అధికారులు గ్రామాల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున ఫలితాలు వెల్లడించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) ఉల్లంఘనకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్లు, పెట్రోలింగ్‌ చెక్‌పోస్టులను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే వారు, ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి, ముందస్తుగా బైండోవర్‌ చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు, అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు చేపడుతున్నారు.

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారికి పోలీస్‌ స్టేషన్ల వద్ద ముందస్తుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌ ఇప్పటికే హెచ్చరించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరాలకు, తగాదాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహించేవారు, పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.

ఫ జూన్‌ 4న ఎన్నికల ఫలితాల

నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం

ఫ జిల్లాలో 24 గంటలూ నిఘా

ఫ గ్రామాల్లో గొడవలు జరగకుండా

144 సెక్షన్‌

ఫ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి

భద్రత వెరీ స్ట్రాంగ్‌
1/1

భద్రత వెరీ స్ట్రాంగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement