ఆర్థిక వ్యవస్థపై సంస్కరణల ప్రభావం త్వరలో.. | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థపై సంస్కరణల ప్రభావం త్వరలో..

Published Sat, Nov 1 2014 12:19 AM

ఆర్థిక వ్యవస్థపై సంస్కరణల ప్రభావం త్వరలో..

వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకుంటున్న సంస్కరణలకు సంబంధించిన సానుకూల ప్రభావాలు వచ్చే ఏడాది నుంచి కనిపించగలవని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత్ ర్యాంకింగ్ మెరుగవడంలో ఇది ప్రతిఫలించగలదని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు. జూన్ 1 తర్వాత కొత్త ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రపంచ బ్యాంకు 2016 వ్యాపార నిర్వహణ నివేదిక రూపకల్పనలో పరిగణనలోకి తీసుకునే అవకాశముందని మంత్రి చెప్పారు.

వ్యాపార నిర్వహణకు సానుకూల పరిస్థితులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన తాజా జాబితాలో భారత్ మరో రెండు స్థానాలు దిగజారి 142వ ర్యాంకుకు పడిపోయిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2013 జూన్- 2014 మే మధ్య జరిగిన సంస్కరణలను మాత్రమే ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుందని, కొత్త వాటిని పరిగణించలేదని పారిశ్రామిక ప్రోత్సాహక, విధాన విభాగం (డీఐపీపీ) మరో ట్వీట్‌లో పేర్కొంది.

Advertisement
 
Advertisement