చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం | Robbery on Chennai Express near guntur district | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం

Apr 1 2014 6:55 AM | Updated on Aug 30 2018 5:27 PM

చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం - Sakshi

చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం

జిల్లాలోని నడికూడి వద్ద అర్థరాత్రి చెన్నై - హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

గుంటూరు:  దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. రైళ్లో దూరప్రయాణాలు చేసే ప్రయాణికులపై రాత్రివేళల్లో దాడులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని నడికూడి వద్ద అర్థరాత్రి చెన్నై - హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్లోకి ప్రవేశించిన దొంగలు ఏసీ, స్లీపర్ కోచ్‌ s11,s12 బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బెదిరించి డబ్బులు, నగలు దోచుకున్నట్టు రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రాత్రి 2:30 గంటల మధ్య చోటుచేసుకున్నట్టు తెలిసింది.

ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా  రైల్లోకి ప్రవేశించిన దొంగలు పిడుగురాళ్ల చెన్నైపాలెం గేటు వద్ద చైన్‌లాగి దోపీడీకి యత్నించినట్టు తెలుస్తోంది. దొంగల బీభత్సానికి ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైయ్యారు. దొంగల దోపీడీతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement