
భూములిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు: చంద్రబాబు
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు భయపడొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
హైదరాబాద్: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు భయపడొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులందరితో వ్యాపారాలు చేయిస్తానని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలకు మొదట రాజధానిలోనే ఏర్పాటు చేస్తామన్నారు. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ఆయన హామీయిచ్చారు.