Breaking News

కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం!

Published on Tue, 12/17/2024 - 03:25

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావుపై ‘ఫార్ములా–ఈ’ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖరాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు సమాచారం. 

ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేస్తారా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ‘ఫార్ములా–ఈ’ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. 

గవర్నర్‌ అనుమతితో ముందుకు.. 
సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘ఫార్ములా–ఈ’ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంపై సూటిగా స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి.  

విదేశీ సంస్థలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు? 
‘విదేశీ కంపెనీలైన ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈఓ), ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించే విషయంలో నిర్ణయాధికారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు ఉందా? రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించవచ్చా? ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత ఈ ఒప్పందం ఎలా చేసుకుంటారు?’ అనే అంశాలపై ఏసీబీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 

భారీగా డబ్బులు చేతులు మారాయని.. 
ఫార్ములా–ఈ కార్ల రేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా డబ్బులు చేతులు మారాయని మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ క్రీడల నిర్వహణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇటీవల కేటీఆర్‌ పేర్కొన్న నేపథ్యంలో... ఈ విషయాలను ఆయన ఏసీబీకి చెప్పుకోవాలని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేటీఆర్‌ అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని, కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందా?, బీఆర్‌ఎస్‌ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 

అధికారులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే! 
‘ఫార్ములా–ఈ’ కారు రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్, ఇతర అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. అరవింద్‌కుమార్‌ విచారణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) అనుమతి అవసరం లేదని.. సీఎస్‌ అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. అధికారిపై నేరారోపణలు నమోదు చేసే సమయంలోనే డీఓపీటీ అనుమతి అవసరమని వెల్లడించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈఓ), ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలపై సైతం ఏసీబీ విచారణ చేపడుతుందని, వాటికి కూడా నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్‌ మౌఖిక ఆదేశాలతోనే ఆ రెండు కంపెనీలకు నిధులు చెల్లించినట్టు అరవింద్‌కుమార్‌ ఇప్పటికే తెలిపారని గుర్తు చేశారు. 

కీలక నిర్ణయాలు.. అసెంబ్లీలోనే ప్రకటన 
సీఎం రేవంత్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై అసెంబ్లీలోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో అవకతవకలపై వేసిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదించినట్టు సమాచారం. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం కొత్తగా తెచ్చిన రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌ఓఆర్‌) బిల్లుతోపాటు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల బిల్లులు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను కూడా కేబినెట్‌ ఆమోదించినట్టు సమాచారం. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా కింద భూమి లేని రైతుకూలీలకు డిసెంబర్‌ 28 నుంచి రూ.12 వేల ఆర్థిక సాయం చెల్లింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వీటిపై అసెంబ్లీ ప్రకటన చేయనుంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)