YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల
బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం
Published on Mon, 07/06/2026 - 19:59
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. సొంతగడ్డపై పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది.
సోమవారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 9న జరగనుంది.
Read: సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
Tags : 1