Breaking News

యువీతో గిల్‌ గురించి మాట్లాడాను.. కపిల్‌ దేవ్‌ మాదిరే అతడు కూడా..

Published on Fri, 06/20/2025 - 19:32

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్‌ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్‌ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తండ్రి, కోచ్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్‌రాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్‌గానూ కెప్టెన్‌ గిల్‌ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.

యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు
‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్‌ గిల్‌ల గురించి నేను యువరాజ్‌ సింగ్‌తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్‌ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్‌ అన్నాడు. అవును.. శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.

కపిల్‌ దేవ్‌ మాదిరి
కెప్టెన్‌ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్‌ నిండుతుంది. శుబ్‌మన్‌ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్‌గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో కపిల్‌ దేవ్‌ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.

జైసూ అర్ధ శతకం పూర్తి
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్‌తో తలపడుతోంది. స్టోక్స్‌ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన స్టోక్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తోంది.

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (42)- యశస్వి జైస్వాల్‌ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు డకౌట్‌ అయ్యాడు.

ఇక మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌- కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్‌ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). 

చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు