లార్డ్స్‌లో శతకం.. 11వ ప్లేయర్‌గా యస్తిక భాటియా రికార్డు

Published on Mon, 07/13/2026 - 08:40

ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్ మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ సేన విజ‌యానికి చేరువ‌లో ఉంది. 457 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌స్తుతం 130 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప భార‌త జ‌ట్టు గెలుపు లాంఛ‌న‌మే కానుంది. 

ఈ నేప‌థ్యంలో భార‌త వికెట్ కీప‌ర్ య‌స్తిక భాటియా లార్డ్స్ స్టేడియంలో అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో (113; 14 ఫోర్లు) సూప‌ర్ సెంచ‌రీ సాధించిన య‌స్తిక భాటియా లార్డ్స్ మైదానంలో సెంచ‌రీ చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా రికార్డులకెక్కింది. సెంచ‌రీతో లార్డ్స్ స్టేడియంలోని బ్యాటింగ్ హాన‌ర్స్ బోర్డులో య‌స్తిక త‌న పేరును లిఖించుకుంది. 

లార్డ్స్ స్టేడియంలో మహిళల క్రికెట్‌లో ఇదే తొలి టెస్టు కావడంతో ఇప్పటివరకు భారత క్రికెటర్‌ స్మృతి మంధాన సాధించిన 83 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా యస్తికా ఆ రికార్డును సవరించింది. ఇక ఓవ‌రాల్‌గా భారత క్రికెట్‌లో (పురుషులు, మ‌హిళ‌లు) క‌లిపి లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది ప్లేయ‌ర్లు శ‌త‌కాలు సాధించారు.

లార్డ్స్ మైదానంలో సెంచ‌రీ చేసిన భార‌త క్రికెట‌ర్ల జాబితా
👉వినూ మ‌న్క‌డ్ (184 ప‌రుగులు, 1952)
👉గుండ‌ప్ప విశ్వ‌నాథ్ (113 ప‌రుగులు, 1979)
👉దిలీప్ వెంగ్‌స‌ర్కార్ (103 ప‌రుగులు 1979లో; 157 ప‌రుగులు 1982లో; 126 నాటౌట్ 1986లో)
👉ర‌విశాస్త్రి (100 నాటౌట్‌, 1990)
👉మహ్మ‌ద్ అజారుద్దీన్ (121, 1990)

👉సౌర‌వ్‌ గంగూలీ (131, 1996)
👉అజిత్ అగార్క‌ర్ (109 నాటౌట్‌, 2002)
👉రాహుల్ ద్ర‌విడ్ (103 నాటౌట్‌, 2011)
👉అజింక్య ర‌హానే (103, 2014)
👉కేఎల్ రాహుల్ (129, 2025)
👉య‌స్తిక భాటియా (105, 2026)

 

 

చదవండి: ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌!

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)