IND vs SA: ఫైనల్‌ మ్యాచ్‌ అంపైర్లు వీరే

Published on Sat, 11/01/2025 - 13:35

మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 ఫైనల్‌ సందర్భంగా కొత్త చాంపియన్‌ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్‌ పోరులో గెలవాలని భారత్‌ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.

కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్‌ ఫైనల్‌కు చేరాయి.

ఎవరు గెలిచినా చరిత్రే
నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్‌ పోరులో భారత్‌- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్‌ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ ‍క్రికెట్‌ మండలి (ICC) ఖరారు చేసింది.

ఫైనల్‌ మ్యాచ్‌ అంపైర్లు వీరే
ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్‌, జాక్వెలిన్‌ విలియమ్స్‌ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా..  సూ రెడ్‌ఫెర్న్‌ థర్డ్‌ అంపైర్‌గా.. నిమాలి పెరీరా ఫోర్త్‌ అంపైర్‌గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్‌ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.

వర్షం పడే అవకాశం
కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ రిపోర్టు తెలిపింది.

ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్‌ డేన మ్యాచ్‌ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్‌ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్‌ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.

వన్డే వరల్డ్‌కప్‌-2025 ఫైనల్‌: భారత్‌- సౌతాఫ్రికా జట్లు
భారత్‌
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి, రాధా యాదవ్‌, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.

సౌతాఫ్రికా
లారా వొల్వర్ట్‌ (కెప్టెన్‌), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్‌, నదినె డి క్లెర్క్‌, మరిజానే కాప్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో మలాబా, అనెరి డెర్క్‌సెన్‌, అనెకె బాష్‌, మసబట క్లాస్‌, సునే లూస్‌, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్‌. 

చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)