Breaking News

ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌

Published on Thu, 10/23/2025 - 19:58

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్‌ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్‌ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.

వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్‌ (55 బంతుల్లో 76 నాటౌట్‌; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా వర్షం​ కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 10, రిచా ఘోష్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

న్యూజిలాండ్‌ బౌలర్లలో రోస్‌మేరీ మైర్‌, అమేలియా కెర్‌, సూజీ బేట్స్‌కు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

చదవండి: గర్జించిన బంగ్లాదేశ్‌ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)