Breaking News

సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్‌ క్రికెటర్‌

Published on Mon, 03/09/2026 - 10:01

టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలవడంపై పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ స్పందించాడు. భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్‌లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్‌ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టుగా.. ఓవరాల్‌గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.

ప్రశంసల వర్షం 
ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.

‘‘పాకిస్తాన్‌లో క్రికెట్‌ టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.

అసలు ఈ సంజూ శాంసన్‌ ఎవరు?
అసలు ఈ సంజూ శాంసన్‌ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్‌ కిషన్‌.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.

క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్‌లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్‌ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.

అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. 

ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం
కానీ మన పాకిస్తాన్‌ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్‌ షెహజాద్‌ పాక్‌ క్రికెట్‌ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. 

చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్‌

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)