Breaking News

‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’

Published on Wed, 09/24/2025 - 11:52

సూర్యకుమార్‌ సేనపై టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్‌ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్‌తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.

ఆసియా కప్‌ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్‌ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.

తీవ్రస్థాయిలో కవ్వింపులు
ఇక సూపర్‌-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి పాక్‌పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.

ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్‌ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.

బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు
దీంతో ఫర్హాన్‌ సెలబ్రేషన్స్‌ పాక్‌ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్నపుడు పాక్‌ పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, హ్యారీస్‌ రవూఫ్‌ భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.

అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్‌ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్‌ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ డష్కాటే స్పందించాడు.

వాళ్ల చేష్టలు పట్టించుకోము
‘‘హ్యారిస్‌ రవూఫ్‌ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.

బ్యాట్‌తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్‌లో పాక్‌ తొలుత బాగానే బ్యాటింగ్‌ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్‌) అలా చేశాడు.

అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్‌ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.

గర్వకారణం
వాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు.  నిజానికి ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.

ఇలాంటి మ్యాచ్‌లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్‌, మా బ్యాటర్లతో పాక్‌ బౌలింగ్‌ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. 

చదవండి: బీసీసీఐకి శ్రేయస్‌ అయ్యర్‌ లేఖ!.. ఇకపై నేను...

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు