Breaking News

ప్రాక్టీస్‌లో టీమిండియా

Published on Sat, 01/10/2026 - 05:23

వడోదర: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్‌లో కోహ్లి, రోహిత్‌ మంచి టచ్‌లో కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ బంతులను ప్రాక్టీస్‌ చేశారు. 

టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్‌ చాటుకున్నారు. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా నెట్స్‌లో చమటోడ్చాడు.

 గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.  గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్‌ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, మొహమ్మద్‌ సిరాజ్‌ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. వన్డే సిరీస్‌ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరగనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)