పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్‌పై సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 06/16/2026 - 17:34

అతి పిన్న వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.

పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్‌ క్యాప్‌
తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్‌ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.

ముక్కోణపు వన్డే సిరీస్‌లో
ఇక ప్రస్తుతం భారత్‌- ‘ఎ’ తరఫున వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్‌, లంక, అఫ్గనిస్తాన్‌ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌తో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ బిజీగా ఉన్నాడు. 

అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్‌ విశేన్‌ హలంబగే వైభవ్‌, సూర్యాంశ్‌ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.

దీంతో వైభవ్‌, సూర్యాంశ్‌ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్‌ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

వైభవ్‌ ప్రవర్తనపై విమర్శలు
ఈ నేపథ్యంలో వైభవ్‌ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్‌ బోర్డు మీడియా మాజీ మేనేజర్‌ బ్రేన్‌ థామస్‌ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.

పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‌
‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్‌లో యెల్లో, రెడ్‌ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్‌ రిఫరీ గనుక ఈ కౌబాయ్‌ను తదుపరి మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.

అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.

హేయ్‌ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్‌మెన్‌ గేమ్‌’’ అంటూ బ్రేన్‌ థామస్‌ పరుష పదజాలంతో వైభవ్‌ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. 

‘స్పెల్లింగ్‌ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో వైభవ్‌ ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!
భారత జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అక్కసు


 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)