‘వైభవ్‌ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’

Published on Thu, 07/02/2026 - 11:50

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌.. ఈ మెగా ఈవెంట్‌ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్‌ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.

తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.

అతడిని తప్పించండి
ఇలా వరుసగా గత మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్‌ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్‌ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్‌నే ఓపెనింగ్‌ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.

సంజూకే నా మద్దతు.. 
క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్‌ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్‌లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్‌ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్‌ ఓపెనర్‌గా సరైనోడే.

ప్రపంచకప్‌ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్‌ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. 

వైభవ్‌ ఆ హక్కు సంపాదించుకోవాలి
కానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్‌కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్‌ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్‌ కార్తిక్‌ పేర్కొన్నాడు. 

కాగా ప్రపంచకప్‌-2026 నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.

చదవండి: IND vs ENG: ఇషాన్‌ రనౌట్‌.. తప్పు నీదే!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)