Breaking News

WC 2026: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Published on Wed, 02/04/2026 - 20:15

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్‌ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.

ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్‌ సిక్స్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్‌ జట్టుతో తలపడింది.

ఇద్దరు శతకాలు బాది
హరారేలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్‌ బ్యాటర్లలో ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగి.. అఫ్గన్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.

వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్‌ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్ చౌహాన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్‌ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. 

శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్‌
ఓపెనర్లలో వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్‌ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.

మిగతా వారిలో విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్‌ దంచికొట్టడంతో అఫ్గన్‌ విధించిన లక్ష్యాన్ని భారత్‌ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. 

కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం ఫైనల్‌ జరుగనుంది. 

చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)