Breaking News

‘ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్‌ తీసుకో.. సగం సగం వద్దు’

Published on Wed, 08/05/2026 - 13:03

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు.

ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్‌ తీసుకో
గతంలో వెన్నునొప్పితో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఈసారి మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్‌ కర్సాన్‌ ఘవ్రీ బుమ్రాను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. మిడ్‌-డేతో మాట్లాడుతూ..

‘‘బుమ్రా ఐదు నుంచి ఆరు నెలలు.. లేదంటే ఓ సంవత్సరం పాటు విరామం తీసుకోవాలి. వందశాతం ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అలా కాకుండా ప్రతీసారి హడావుడిగా జట్టుతో చేరి.. మధ్యలోనే గాయం వల్ల నిష్క్రమిస్తే కూర్పు దెబ్బతింటుంది.

జట్టు ప్రణాళికలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. పనిభారం తగ్గించేందుకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇదంతా వృథా ప్రయాస. ఏదైనా సిరీస్‌ లేదంటే.. టోర్నీ మొత్తం పనిభారం అనే ప్రస్తావన లేకుండా జట్టుతో కొనసాగే ఆటగాడికే పెద్దపీట వేయాలి.

భువీ, షమీలను పిలిపించండి
బుమ్రా కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే అతడిని జట్టులో చేర్చాలి. నిజానికి భారత వెటరన్‌ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నారు. గాయాల బెడద లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటున్నారు. వారిని తిరిగి టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుంది.

సెలక్టర్లు షమీ, భువీల పేర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఫాస్ట్‌ బౌలర్లలకు గాయాలు సహజం. అయితే, బుమ్రా గత రెండు- మూడేళ్ల నుంచి తరచూ గాయపడుతున్నాడు. మెజారిటీ, కీలక మ్యాచ్‌లకు అతడు దూరమవుతున్నాడు. టీమిండియాకు ఇది ఎంతమాత్రమూ శుభసూచకం కాదు’’ అని ఘవ్రీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

బుమ్రా స్థానంలో..
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన  శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో జమ్మూ కశ్మీర్‌ పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీకి మొదటిసారి భారత జట్టు పిలుపు లభించింది.

కాగా 29 ఏళ్ల నబీ దేశవాళీ క్రికెట్‌లో గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండు వరుస సీజన్లలో కలిపి అతను ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్‌లో 60 వికెట్లు తీసిన నబీ... జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

చదవండి: సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)