వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?: సాంట్నర్‌పై సౌతాఫ్రికా లెజెండ్‌ ఫైర్‌

Published on Sat, 02/28/2026 - 17:20

ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్‌ చేరేందుకు మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది.

 159 పరుగులు
కొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (35), ఫిన్‌ అలెన్‌ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్‌ 159 పరుగులు చేయగలిగింది.

ఆదిలోనే ఎదురుదెబ్బలు
ఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్‌ డాసన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కివీస్‌ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (2), జోస్‌ బట్లర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (26)ను ఫిలిప్స్‌ తొందరగానే పెవిలియన్‌కు పంపాడు.

ఆఖర్లో అంతా తలకిందులు
ఇక జేకబ్‌ బెతెల్‌ (21), సామ్‌ కర్రాన్‌ (24) నిరాశపరచగా.. టామ్‌ బాంటన్‌ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్‌ జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. 

ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్‌ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్‌లో రెండు సింగిల్‌, ఫోర్‌ బాది పని పూర్తి చేశారు.

మొత్తంగా జాక్స్‌ 18 బంతుల్లో 32, రెహాన్‌ అహ్మద్‌ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. 

కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర మూడు, మ్యాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్‌కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోతేనే న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరగలదు.

వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్‌ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్‌ స్పిన్నర్‌లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్‌ ఉంటుందా?’’ అంటూ కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు గ్రేమ్‌ స్మిత్‌ చురకలు అంటించాడు.

చదవండి: T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)