వరుస ఫెయిల్యూర్స్‌ తర్వాత.. ఎట్టకేలకు

Published on Thu, 02/26/2026 - 20:04

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.

ఆది నుంచి దారుణంగా విఫలం
టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ
అనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్‌ శర్మ పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.

దీంతో అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

అర్ధ శతకంతో
జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్‌లో తొలి  వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్‌లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

ఇదిలా ఉంటే..  16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 16, తిలక్‌ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు.  ఓపెనర్‌ సంజూ శాంసన్‌ 24, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)