Breaking News

T20 WC: ఆసీస్‌కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం

Published on Fri, 02/13/2026 - 14:43

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్‌-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్‌- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్‌లో తలపడ్డాయి.

ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్‌ బెనెట్‌ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

రజా మెరుపు ఇన్నింగ్స్‌
వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్‌ బర్ల్‌ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ సికందర్‌ రజా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో మార్కస్‌ స్టొయినిస్‌, కామెరాన్‌ గ్రీన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

చెలరేగిన ముజర్‌బానీ
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్‌ ముజర్‌బానీ జోష్‌ ఇంగ్లిస్‌ (8)ను.. బ్రాడ్‌ ఎవాన్స్‌ కెప్టెన్‌ ట్రవిస్‌ హెడ్‌ (17)ను వెనక్కి పంపించారు.

వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్‌ డకౌట్‌ చేయగా.. ముజర్‌బానీ సైతం టిమ్‌ డేవిడ్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. పవర్‌ హిట్టర్లు ఇద్దరూ డకౌట్‌ కావడంతో ఆసీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (31)తో కలిసి మ్యాచ్‌ రెన్షా ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్‌బానీ బౌలింగ్‌లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్‌ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్‌బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్‌ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.

146 పరుగులకే ఆలౌట్‌
అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్‌ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్‌ ఎల్లిస్‌ ఫోర్‌ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్‌ ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్‌ రనౌట్‌ (0) కావడంతో ఆసీస్‌ పదో వికెట్‌ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్‌ మూడు వికెట్లు కూల్చి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్‌ బర్ల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలి ఎడిషన్‌ 2007లో ఆసీస్‌ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్‌పై గెలుపొందడం ఇదే మొదటిసారి.

చదవండి: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. నేపాల్‌పై ఇటలీ గెలుపు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)